*నేటిసాక్షి* మే 14 తిరుమలాయపాలెం (రుద్రరాజు) గత గ్రామాలలో నిరంతరం ప్రజలను చైతన్య పరుస్తూ ఎంతో ప్రాయాసపడి భారాన్ని కుటుంబ భారాన్ని మోస్తూ తక్కువ జీతాలతో ఎక్కువ ఫలితాన్ని ప్రభుత్వానికి అందిస్తున్న మమ్ములను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని కనీస ఉద్యోగస్తులుగా కూడా గుర్తింపు ఇవ్వడం లేదని వివోఏల జేఏసీ ఆధ్వర్యంలో విఓఏ లు వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి ముందస్తు సమ్మె నోటీసును అందజేశారు.ఈ సందర్భంగా వివో ఎలా జేఏసీ అధ్యక్షురాలు సుశీల మాట్లాడుతూ ఈ నెల 6వ తారీకు నుంచి 18వ తారీకు వరకు తమ అమూల్యమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. 18వ తారీకు లోపు సమస్యలు పరిష్కరించని పక్షంలో 18వ తారీకు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.వివోఏలకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిల చెల్లింపు, పని భారం తగ్గింపు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వివో ఏ ల జిల్లా అధ్యక్షురాలు వేల్పుల సుశీల మండల కార్యదర్శి గుగ్గిళ్ళ ఉమా పోలిశెట్టి అరుణ నూకల వసంత సామినేని కరుణ మేకల కృష్ణవేణి మెట్టు స్వరూప రాణి గోపోజి ఉపేంద్ర పద్మ రాములమ్మ గుగ్గిళ్ళ విజయ నాగమణి కళ్యాణి సువర్ణ నీరుడు లలిత జయ పద్మ మండలం లోని వివోఏలు, , జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





