Thursday, May 14, 2026

*బండి సాయి భగీరధ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి – బీఎస్పీ హెచ్చరిక**పోక్సో కేసులో ఆలస్యం ఎందుకు..? ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎన్నబోయిన రమేష్ యాదవ్

**నేటిసాక్షి* మే 14 తిరుమలాయపాలెం (రుద్రరాజు) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుత్ర రత్న బండి సాయి భగీరథ ను వెంటనే అరెస్టు చేసి, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను పదవి నుండి తప్పించాలని బి ఎస్ పి పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు వెన్న బోయిన రమేష్ డిమాండ్ చేశారు గురువారం తిరుమలాయపాలెం: మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌ లో బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ మాట్లాడుతూ, మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరధ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బండి సాయి భగీరధ్‌పై పోక్సో కేసు నమోదై వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం బాధాకరమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు భయపడి బాధిత కుటుంబానికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు పూర్తిగా అబద్ధాలని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో చట్టాలు ధనికులు, అధికార వర్గాలకు ఒకలా.. సామాన్య ప్రజలకు మరోలా అమలవుతున్నాయని అన్నారు. అందువల్లే ఇప్పటివరకు బండి సాయి భగీరధ్‌పై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే అరెస్ట్ చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పాలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొమ్ము పూలే, మండల నాయకులు పోలేపొంగు నాగరాజు, కొమ్ము వీరబాబు, కొమ్ము కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News