నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ (ఎండి ముబీన్)వాంకిడి మండల కేంద్రంలోని మాలి సంక్షేమ సంఘ భవనంలో ఈ రోజు సమావేశం నిర్వహించి, ఈ నెల 18వ తేదీన ఖిరిడీ గ్రామంలో జరగనున్న మహాత్మ జ్యోతిరావు పూలే నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర మాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గుర్నూలే నారాయణ గారికి ఖిరిడీ గ్రామ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాలి సంక్షేమ సంఘం నాయకులు तथा కాంగ్రెస్ నాయకులు మండోకర్ అనిల్, జాబోరే గణేష్, మండోకర్ దాదాజీ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.





