నేటి సాక్షి ప్రతినిధి ( సుధాకర్ గౌడ్ ముదేలి ) మహేశ్వరం న్యూస్మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో మంజూరైన *20* సీఎంఆర్ఎఫ్ (Chief Minister Relief Fund) చెక్కులను లబ్ధిదారులకు *_మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు_* అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే *సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ —* ఆపద సమయంలో ప్రజలు ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారని, అయితే ప్రభుత్వానికి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెక్కుల మంజూరులో ఏ పద్ధతి, ఏ నిష్పత్తి పాటిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం, నిష్పత్తి ప్రకారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయాలని సూచించారు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని మానవీయ దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.





