నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్:నంబాల రైల్వే గేట్ నుంచి నంబాల గ్రామానికి వెళ్లే మార్గంలో సుమారు 600 మీటర్ల పొడవున రహదారి ఇరువైపులా ముళ్ల పొదలు విపరీతంగా పెరిగి, రహదారి మీద తీవ్రమైన గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ఆటో డ్రైవర్లు మరియు ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నంబాల సర్పంచ్ రత్నం లక్ష్మి నీలయ్య, గంగాపూర్ సర్పంచ్ వెంకటేశం చారి గార్లు శనివారం జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో ముళ్ల పొదల తొలగింపు పనులను ప్రారంభించారు. అలాగే రెండు నుంచి మూడు రోజుల్లో రహదారి గుంతల్లో కాంక్రీట్ వేసి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని వారు తెలిపారు.అదేవిధంగా నంబాల రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రముగా ఉన్న నేపథ్యంలో, పార్టీలు–రాజకీయాలకు అతీతంగా గేట్‌కు ఇవతల ఉన్న అన్ని గ్రామాల సర్పంచులతో సమన్వయం చేసుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం త్వరలోనే ఎమ్మెల్యే, ఎంపీ మరియు ఇన్‌చార్జ్ మంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు పల్లె ప్రకాష్ రావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కోవూరి శ్రీనివాస్, ఉపసర్పంచ్ పాగిడి విజయ్, వార్డు సభ్యులు బక్క ఆనంద్, వెంకటి, సీనియర్ నాయకులు సిద్ధెంకి సత్తయ్య, కుందారపు నాగేష్, పూదరి సత్తయ్య, గాంధర్ల శంకర్‌తో పాటు పలువురు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రహదారి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టిన సర్పంచులను స్థానిక ప్రజలు మరియు ఆటో డ్రైవర్లు అభినందించారు.




