నేటి సాక్షి ప్రతినిధి రుద్రంగి : ( కోక్కుల వంశీ )వేములవాడ నియోజకవర్గ ప్రజలకు రుద్రంగి మండలం మానాల గ్రామ ఉపా సర్పంచ్ దాసరి అశోక్ ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేములవాడ నియోజకవర్గం లో గెలిచినా ముదిరాజ్ సోదరులకు సోదరిమణులకు సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులుగా గెలిపొందిన వారందరికీ ముందస్తు గా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, కథలాపూర్, మేడిపెల్లి, భీమారం, మండలాలలో ముదిరాజులు ఇదే చైతన్యం తో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ లుగా గెలవాలని అందరి మన్ననలు పొంది ప్రజాసేవ చేయటానికి ముందుకొచ్చి ముదిరాజులందరిని చైతన్య పరుస్తూ బతుకు బాగు కోసం ఒక మార్పును తీసుకరావాలని అన్నారు. గెలిచినా గౌరవ సభ్యులందరినీ పేరుపేరునా కోరుచున్నాను. మార్పుకోసం అడుగులు ముందుకు వేద్దాం. ఇతరులతో విలువగా బతుకుదాం. రాబోయే నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్ననని ఆకాంక్షించారు. వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చెప్పుకొచ్చారు.

