*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అంజుమ, ఎంపీఓ పి. నీరజ, కలిసి మేడిపల్లి మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ,ఎంపీఓ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల కృషిని అభినందించారు.





