Wednesday, March 11, 2026

*కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు..*

*నేటి సాక్షి – మెట్ పల్లి (దామ రాజేష్)* మెట్‌పల్లి పట్టణ 12వ వార్డుకు చెందిన సుద్దాల హారిక–రాజేశ్వర్ గౌడ్ తమ అనుచరులతో కలిసి సుమారు 120 మందితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేరికైన వారందరికీ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన అపూర్వమైన ప్రగతిని వివరించారు. .రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, పేదల కోసం డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు..బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని, మాట కాదు–పని చేసే పార్టీ అని పేర్కొంటూ, తెలంగాణ ఆత్మగౌరవం, స్వాభిమానం కాపాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు..రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి, మెట్‌పల్లి పట్టణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని కార్యకర్తలు, ప్రజలను కోరారు..ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News