Sunday, March 8, 2026

*మహా శివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో జాతర కమిటీ చైర్ పర్సన్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్**వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సమన్వయ సమావేశం**వి. శివకుమార్*:- ఈ నెల 14, 15, 16 తేదీల్లో మహా శివరాత్రి జాతర సందర్బంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించగా, జాతర కమిటీ చైర్ పర్సన్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితే, ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్ పర్సన్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి శ్రీ  ఆలయం దాకా, వేములవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లలో మరమ్మత్తులు, నిర్మాణాలు, హెలిప్యాడ్ వద్ద, ఇతర చోట్ల బారికేడింగ్ పక్కా ప్రణాళిక పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్ లు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ ఏడాది 600 బస్సులు ఏర్పాటు చేస్తామని, ఇంకా భక్తుల రద్దీకి అనుగుణంగా వాహనాలుఅందుబాటులో పెడుతామని ఆర్టీసీ ఆర్ఎం తెలిపారు. జడ్పీ డిప్యూటీ సీఈఓ, వేములవాడ మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలాలు, క్యూ లైన్లు ఇతర చోట్ల మూడు షిఫ్ట్లలో సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు. జాతరకు ముందు నుంచి తరువాత మూడు రోజుల వరకు పారిశుధ్య సేవలు అందించాలని సూచించారు. జిల్లా  సంక్షేమ శాఖ అధికారి ఆద్వర్యంలో బస్సు స్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఇతర చోట్ల పూర్తి వివరాలతో హెల్ప్ డెస్క్ లు సిబ్బంది అందుబాటులో పెట్టాలని, ప్రతి చోట అన్ని వివరాలతో కూడిన సైన్ బోర్డులు పెట్టించాలని తెలిపారు. ఆలయంలోని క్యూల వద్ద, పార్కింగ్ స్థలాల వద్ద, బస్సు స్టాండ్లలో  తాగు నీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ, ఆలయ అధికారులను ఆదేశించారు. భక్తులకు అల్ఫాహారం చక్కటి వాతావరణంలో కల్పించాలని సూచించారు. సెస్ అధికారులు భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం, ఇతర చోట్ల 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కూడా చేసుకోవాలని, అధికారులు, సిబ్బంది ఉండాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖా ఆద్వర్యంలో భీమన్న ఆలయం, ప్రసాదం కౌంటర్, పార్కింగ్ స్థలాలు ఇతర చోట్ల వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్ లతో సిద్దంగా ఉండాలని, వేములవాడ ఏరియా హాస్పిటల్, సిరిసిల్ల జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అగ్ని మాపక శాఖా అధికారులు ప్రధాన ఆలయాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు చెక్ చేయాలని, వారి సిబ్బంది గుడి ఆవరణలో జాతర సమయంలో సిద్దంగా ఉండాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు భక్తులకు అందించే ప్రసాదం, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించాలని ఆదేశించారు. క్యూ లైన్లు, వీఐపీలు, కళ్యాణ కట్ట, ఇతర చోట్ల రద్దీ నియంత్రణ, దర్శనం పూర్తి చేసేందుకు జిల్లా స్థాయి అధికారులను నియమించామని, వారు ఆయా ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. నాంపల్లి వద్ద భక్తుల రద్దీ నియంత్రణ, ఏర్పాట్ల కల్పనకు ఇద్దరు అధికారులను నియమించామని వివరిం చారు. కోడెల నిర్వహణ, సంరక్షణ జిల్లా పశు సంవర్ధక శాఖ, ఆలయ అధికారులు సమన్వయంతో చూసుకోవాలని ఆదేశించారు. వేములవాడలో లాడ్జ్ లలో అద్దెలు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. జాతరలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగిం చకుండా చూడాలని, క్యూ లైన్ల వద్ద తాగునీటిని స్టీల్ గ్లాస్ లలో ఇవ్వాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు సహాయం కోసం వీల్ చైర్లు వాలంటీరను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతర విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి కావాల్సిన గదులు, ఆహారం, ఇతర సదుపాయాలు వేములవాడ ఆర్డీఓ, ఆలయ అధికారులు చూసుకోవాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా దర్శనం, వసతులలో ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేసారు. వచ్చిన భక్తులు దర్శనం, క్షేమంగా వెళ్ళేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. జాతరకు సంబందించిన పనులన్నీ రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలని జాతర చైర్ పర్సన్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News