Saturday, March 7, 2026

మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ మండల ఆలూరు,రాజ్ నగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి 10 లక్షల చొప్పున మంజూరు కాగా శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా జగిత్యాల వారు మాట్లాడుతూమహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్యారంగం, వైద్య రంగం మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు.అధికార పార్టీ అండతో అభివృద్ది సాధ్యం అవుతుంది అన్నారు. గ్రామలలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో మహిళా సంఘాల శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని మహిళా స్వయం సహయక సంఘ సభ్యులు ప్రభుత్వానికి ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు నల్లాల స్వామి,భారతపు రాజేష్,ఉప సర్పంచ్ లు సల్ల మహేష్,శ్రీనివాస్,మండల నాయకులు రవీందర్ రెడ్డి,కోల శ్రీనివాస్,మోర హనుమండ్లు, గన్నెరాజిరెడ్డి భాస్కర్ రావు సురేందర్ రెడ్డి రామ్ రెడ్డి ఆయా గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News