Saturday, March 7, 2026

*ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా మునిసిపాలిటీలు ఉండాలి* *రాయికల్ లో గులాబీ జెండా ఎగరవేస్తాం..జగిత్యాలలో ఊహించని మెజార్టీ సీట్లు సాధిస్తాం-ఎమ్మెల్సీ ఎల్.రమణ* —————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…………………………………..జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల కార్యాలయంలో ( నివాసంలో) మీడియా సమావేశం నిర్వహించారు.*ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు మాట్లాడుతూ*మునిసిపాలిటీలు ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా రాజ్యాంగం ప్రకారం ప్రధానంగా బల్దియలో అవకతవకలకు అవకాశం లేకుండా ఉండాలని అన్నారు.మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ ఎస్ హాయంలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుంచామని,అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టామన్నారు.ప్రజాక్షేత్రంలో బీఆర్ ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన లభించిందని,జగిత్యాల నియోజకవర్గంలోని రాయకల్ మరియు జగిత్యాల పట్టణంలో గులాబీ జెండా ఎగరవేస్తున్నామని,జగిత్యాల మునిసిపాలిటిలోను ఊహించని తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని అన్నారు.ఎమ్మెల్సీ ఎల్.రమణ.ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీలు విస్మరించాయని,గులాభి సైనికులకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు.నిఖార్సయిన గులాభి సైనికులకు,నిబద్ధత కలిగిన నిజాయితిపరులకే సీట్లు ఇచ్చామని అన్నారు.*జగిత్యాలలో గులాబి జెండా హవా నడుస్తోంది*ఓటర్లను ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా వారు స్పష్టంగా ఉన్నారుజగిత్యాల అభివృద్ధి పై వైరల్ అవుతున్న వీడియోలు బీ.ఆర్.ఎస్ హయాంలో చేసినవే రెండేళ్లలో అక్కడక్కడ సీసీ రోడ్లు తప్ప చేసిందేమీ లేదు.ప్రశ్నించే గొంతుకలకు ఓటేయబోతున్నారు ప్రజలు ఈ ఎన్నికల్లో ఎలక్షన్ మిరాకిల్ జరగబోతోంది.మెడికల్ కళాశాల,నర్సింగ్ కళాశాల,మాత శిశు కేంద్రం,చింతకుంట చెరువు అభివృద్ధి ఘనత బి.ఆర్ ఎస్ దే4520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు ఇచ్చినవే..అప్పుడే స్వయంగా కేటీఆర్ గారు లబ్ధిదారులకు అందించారు.ఈ కార్యక్రమంలో BRS నాయకులుదావ సురేష్,ఎల్ కార్తికేయ,పట్టణ అధ్యక్షులు అయిల్నేని వెంకటేశ్వర్ రావు,ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు,మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ,శీలం ప్రవీణ్, ఆసీఫ్,అనంతుల గంగారెడ్డి, పడిగేల గంగారెడ్డి,ఎండబెట్ల ప్రసాద్,వొళ్ళాల గంగాధర్,వనమాల నిరంజన్,కుడిక్యాల సర్వేశ్వర్, అజ్ఘర్ ఖాన్,వసీం,గంగిపెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News