నేటి సాక్షి 02 మార్చి పాములపాడు:-అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాములపాడు మండలం నుండి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు బి.శివలక్ష్మి ఆధ్వర్యంలో చలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి బయలుదేరి వెళ్లి, పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు బి.శివలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు 26 వేల రూపాయల జీతం పెంచాలని, హెల్పర్స్ కూడా జీతం పెంచాలని, గ్రాన్టివిటీ అమలు చేయాలని, ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగానే మాకు కూడా రెండు నెలల వేసవి సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల అంగన్వాడీ వర్కర్లు జ్యోతి కుమారి, తులసమ్మ, శ్రీలత, రమాదేవి, నాగమ్మ, స్వర్ణకుమారి, సరస్వతి, పుష్ప, సరోజ, లక్ష్మీదేవి, దానమ్మ, హెల్పర్లు కృష్ణవేణి, పద్మావతి, రాజేశ్వరి, నాగమణి, మణి కవిత, మరియు పాములపాడు సెక్టార్ లోని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్స్ అందరూ పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.





