నేటి సాక్షి 20 ఏప్రిల్ పాములపాడు:- మండల కేంద్రంమైన పాములపాడులో తెలుగుదేశం పార్టీ అధినేత, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు క్లస్టర్ ఇంచార్జి బండ్లమూరి.వేంకటేశ్వర రావు, పాములపాడు సొసైటీ ఛైర్మెన్ రాయపాటి గోవిందు, తెలుగుయువత మండల అధ్యక్షుడు షేక్.కరీంబాష, జూటూరు నాయకులు నాయిని మధు, టి ఎన్ టి యుసి మండల అధ్యక్షుడు జడల నాగరాజు లు కార్యకర్తలతో కలిసి కేక్ ను కటింగ్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి, ఆయన చేసిన అభివృద్ధి గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సతీష్, లేపాక్షి, శివ శంకర్, మనోహర్, నాగశేషులు, శివ, రాయపాటి మల్లికార్జున, బన్నీ, లక్ష్మీ నారాయణ, వాజీద్ తదితరులు పాల్గొన్నారు.





