Monday, April 20, 2026

అందరూ సమానులే ఘనంగా శ్రీ మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు.

. నేటి సాక్షి, పరిగి చౌడాపూర్. (సురేష్ మోత్కూర్ )ఈరోజు చౌడాపూర్ మండల కేంద్రంలోని మండల ఎంపీడీవో, ఎంఆర్ఓ, కార్యాలయం ఆవరణంలో శ్రీ బసవేశ్వర స్వామి 893 వ జయంతి వేడుకలను శ్రీ వీరశైవ సమాజ మరియు మండల వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొని, శ్రీ బసవేశ్వర స్వామి గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ 900 సంవత్సరాల క్రితమే మనుషులంతా సమానమే, లింగ బేదం లేదంటూ బోధించడం జరిగింది.నాటి ఆయన బోధనలే నేటికీ ఆచరణియమైనవి. నేటి యువతకు ఆచరణీయమైన ఆయన బోధనలు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో సోమలింగం,ఎమ్మార్వో వెంకటేశ్వర్లు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్పటి అశోక్ కుమార్,గ్రామ సర్పంచ్ పరిగి నవీన్ కుమార్,వీరశైవ సంఘ నాయకులు డాక్టర్ శరభలింగం,మఠం రాజశేఖర్, మలమానాడు జిల్లా అధ్యక్షులు వెంకటేష్, బిజెపి మండల మాజీ అధ్యక్షులు బందయ్య,మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు. యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News