Monday, April 20, 2026

సీఎం చంద్రబాబు జన్మదినం.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు :- స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు* 76 ఏళ్ల వ‌య‌స్సులోనూ రాష్ట్రాభివృద్ధి కోస‌మే ఆయ‌న పోరాటం

నేటి సాక్షి 20 నంద్యాల జిల్లా రుద్రవరం:–నంద్యాల జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రుద్రవరం గ్రామం టిడిపి నాయకులు హుసేన్ భాష ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు మాట్లాడుతూ , ప్రజల మనసుల్లో నిలిచిపోయే నాయకత్వం, అపారమైన దూరదృష్టి సీఎం చంద్రబాబు ప్రత్యేకత అని ప్రశంసించారు. అభివృద్ధి పట్ల ఆత్మవిశ్వాసంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా భావించే నాయకుడు ఆయన అని అభివర్ణించారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా పెద్దన్నలా అండగా నిలిచే వ్యక్తిత్వం సీఎం చంద్రబాబు సొంతమన్నారు. సాంకేతికత, పారదర్శకతతో అభివృద్ధికి మార్గదర్శకుడిగా ఆయన నిలుస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతోపాటు దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అని అన్నారు. 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. సంక్షోభంలో సైతం సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుకి నిత్యం భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన మరిన్ని జరుపుకోవాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆయన నాయ‌క‌త్వంలో ప్రజలంతా సంతోషంగా ఉంటారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పారు. ఆయన నాయకత్వంలో పని చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి. హుస్సేన్ బాషా,మధు రామసుబ్బయ్య, బషీర్, మల్లికార్జున, హిమామ్ ఖాసీం,కరీముల్లా,రామక్రిష్ణ, రమణారెడ్డి, శివుడు, నబిరసూల్, ప్రవీణ్,శివ, నాగేశ్వరావు, శివ కుమార్, సద్దాం ,శేఖర్, గ్రామ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News