Wednesday, March 4, 2026

గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స24 వారాల పరిమాణంలో భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ తొలగింపు

నేటి సాక్షి గజ్వేల్ : గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన గర్భాశయ ఫైబ్రాయిడ్ (లియోమయోమాస్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన 43 సంవత్సరాల మహిళ గర్భాశయంలో 24 వారాల గర్భ పరిమాణంతో సమానంగా పెరిగిన 13x11x10 సెం.మీ. పరిమాణంలోని భారీ ఫైబ్రాయిడ్‌ను గుర్తించి శస్త్రచికిత్స చేపట్టారు.వైద్యులు టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ (TAH) విధానంలో ఆ కణితిని సురక్షితంగా తొలగించారు. క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను డాక్టర్ త్రివేణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రేమ్ కిషోర్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ మైపాల్, డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సిబ్బంది సునీత, సునీల్, థియేటర్ అసిస్టెంట్లు సిహెచ్ వెంకట్ రాజకుమార్, పి.రాజు, అస్ర, పేషంట్ కేర్ యాదమ్మ తదితరులు సమన్వయంతో నిర్వహించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ గర్భాశయ ఫైబ్రాయిడ్లు మహిళల్లో సాధారణంగా కనిపించినప్పటికీ ఇంత పెద్ద పరిమాణంలో ఉండటం అరుదని తెలిపారు. సుమారు 30 శాతం మహిళల్లో అసాధారణ గర్భాశయ రక్తస్రావం, కడుపు నొప్పి, రక్తహీనత, పొత్తికడుపు నిండిన భావన, తరచూ మూత్ర విసర్జన, నడుము నొప్పి, సంతానలేమి వంటి లక్షణాలు కనిపించే అవకాశముందని చెప్పారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News