నేటిసాక్షి, మిర్యాలగూడ : అంగన్వాడి కేంద్రంలో అందించే పోషకాహారం చిన్నారులు, బాలింతలు తప్పనిసరిగా స్వీకరించాలని అన్నారం సెక్టార్ సూపర్వైజర్ నిహారిక అన్నారు. మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ రేఖల మమత ఆదేశాల మేరకు ఈనెల తేదీ 09 నుండి 23 వరకు నిర్వహించే పోషణ పక్వాడాలో భాగంగా మంగళవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అన్నారం సెక్టార్ లోని మాలోతు తండా అంగన్వాడి సెంటర్ లో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాల చిన్నపిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి, గచిరుధాన్యాలు సిరు ధాన్యాల గురించిఅంగన్‌వాడీ కేంద్రంలో అందించే పోషకాహారం తప్పనిసరి తీసుకోవాలని అన్నారు. అంగన్వాడి కేంద్రంకి వచ్చే ప్రతి చిన్నారి, ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు సిద్ధం కావడం లక్ష్యంగా అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయని, అంగన్వాడీ కేంద్రాలకు ఎవరైనా దాతలు సహకారం అందిస్తే వారు “పాంకుడి పోర్టల్” ద్వారా విరాళాలను అందించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, ఝాన్సీ రాణి, షబానా, నజీమా, యశోద, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





