Wednesday, March 4, 2026

తంగేడంచ గ్రామంలోని జైన్ ఇరిగేషన్ ను సందర్శించిన పాములపాడు ఎపి మోడల్ స్కూల్ విద్యార్థులు

నేటి సాక్షి 04 మార్చి జూపాడుబంగ్లా:–నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలోని జైన్ ఇరిగేషన్ పరిశ్రమను బుధవారం రోజున పాములపాడు ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు సందర్శించారు. ప్రభుత్వం ఈ సంవత్సరం 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పాలిటెక్నిక్ లాంటి నూతనంగా సాంకేతిక విద్య కోర్సులను ప్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రవేశ పెట్టట్టింది. దీనికి అణుగుణంగా పాఠ్యంశాలలో ప్రధానంగా మొదటి అధ్యాయంలోనే వ్యవసాయ, అనుబంధ విషయాలపై ప్రత్యేక పాఠ్యాంశాన్ని చేర్చింది. ఈ మేరకు వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాములపాడు ఎపి మోడల్ స్కూల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో జైన్ పరిశ్రమలోని వ్యవసాయ అనుబంధ క్రింద బిందు, తుంపర్ల సేద్యంపై అవగాహ న కార్యక్రమానికి సుమారు 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జైన్ పరిశ్రమ ఇంచార్జి మహేష్, లైజనింగ్ ఆఫీసర్ మౌలాలి, జైన వ్యవసాయ నిపణులు తావణ్ కుమార్ షాసీర్ బాష, చైతన్య, రఫి, రాఘ వేంద్ర, విల్సన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News