నేటి సాక్షి గజ్వేల్….గజ్వేల్ మండలం రంగంపేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మంగలి శ్రీనివాస్ ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ శనివారం ఉదయం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి సంతాపం వ్యక్తం చేశారు.అదేవిధంగా అదే గ్రామానికి చెందిన వడ్ల నర్సింహాచారి గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఇరు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తూ ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.అనంతరం సింగాటం గ్రామానికి చెందిన వంజరి పోచయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు ప్రభాకర్, ప్రసాద్‌లను పరామర్శించారు. అలాగే చిన్న అరెపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి మల్లయ్య గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని సైతం పరామర్శించి తన విచారం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు మధుసూదన్ రెడ్డి, రమేష్ గౌడ్, అహ్మద్, రంగంపేట్ సర్పంచ్ నాగరాజు, దుర్గారెడ్డి, కర్నాకర్ రెడ్డి, స్వామి, మనోహర్, సయ్యద్, మల్లేశం, నరేష్, ప్రహ్లాద్, షాదుల్ తదితరులు పాల్గొన్నారు





