Friday, March 13, 2026

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి-బాల్య వివాహాలు అరికట్టాలి…అక్రమ దత్తత నేరం

నేటిసాక్షి, మిర్యాలగూడ : విద్యార్థులు సోషల్ మాధ్యమాలకు దూరంగా ఉండాలని అర్భన్ సిడిపిఓ మమత అన్నారు. ఐసిడిఎస్ మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంపు సెక్టార్ లో ఉన్న బకల్ వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సిడిపిఓ రేఖల మమత ఆధ్వర్యంలో”బేటీ బచావో బేటి పడావో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గర్ల్ చైల్డ్ పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం పోటీలో ప్రతిభ కనబరిచిన బాలికలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అనంతరం సిడిపిఓ మమత మాట్లాడుతూ, ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ లో అనేక రకాల యాప్స్ వలన కలిగే నష్టాలను, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పేరిట ఎన్నో మోసాలకు గురైవుతున్నారని, తమ ప్రాణాలను కూడా చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం తెలిసి తెలియని వయస్సులో అవతలి వ్యక్తి చెప్పే మాయమాటలకు లొంగిపోవడం జరుగుతుందని, ఇలాంటి క్రైమ్స్ కుఆడపిల్లలు దూరంగ ఉండాలని ఎవరైనా తెలియని వ్యక్తి మీ వివరాలు అడిగినట్లయితే వారికీ ఎటువంటి వివరాలు ఇవ్వకూడదని, ఏదైనా అపాయం ఉన్నట్లయితే 100 కు కాల్ చేసి , అక్కడి సమాచారాన్ని పోలీస్ వారికి చేరావేయాలని సూచించారు. బాల్యవివాహలను అరికట్టాలని, ఆడపిల్లలకు18సంవత్సరాలు , మగపిల్లలకు 21వ సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యేంత వరకు వివాహలు చేయరాదనీ తెలిపారు.బాల్యవివాహాలకు పాల్పడిన వారికీ చట్ట పరమైన శిక్షలకు అర్హులు అవుతారని,ఆడపిల్లల్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత, అలాగే ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పిస్తుందని, ఆడపిల్లలకి ఎలాంటి ఆపద వచ్చినా అక్కున చేర్చుకోవడానికి బాలసదనాలు ఉన్నాయని, ఆడపిల్లలు వద్దు అనుకున్న వాళ్లు ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటుచేసిన ఉయ్యాలలో వేయాలని, అంతేగాని అక్రమ దత్తత ఇవ్వకూడదని తెలియజేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు 181, 1098 , 100 లకు కాల్ చేసి తెలియపరచాలని వివరించారు. గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ గురించి, ఆడపిల్లల చదువు గురించి, ఆడపిల్లల భద్రత గురించి, అక్రమ దత్తత గురించి ,పిల్లలు డ్రాప్ ఔట్ కాకుండా, అందరూ చదువుకోవాలని, బాల్య వివాహాలు చేసుకోకూడదని, అందరూ చదువుకొనేల చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోసూపర్వైజర్ నజీమ బేగం మహమ్మద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి, టీచర్స్ మాధవి, పద్మావతి, శ్రీదేవి,గిరిజ, భాను, స్వాతి, ఉదయ కుమారి, అనిత మరియు స్కూల్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్స్ జ్యోతి, షబానా, బ్లాక్ కో-ఆర్డినేటర్ కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News