నేటి సాక్షి *శ్రీధర్* (మంచిర్యాల్) మార్చి 7 బుగ్గ పరిసరాల్లోని బుగ్గగూడెం గ్రామానికి చెందిన గుండా గణపతి అనే వ్యక్తి పత్తి చేనులో శుక్రవారం నీటి బుడగలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గణపతికి గత రెండు సంవత్సరాల కిందట శ్రీ లక్ష్మీనరసింహస్వామి తాను బుగ్గ ప్రాంతంలో కొలువై ఉన్నానని కలలోకి వచ్చాడు. అప్పటినుండి తరచూ కలలో కనిపిస్తూ తనను ఆరాధించాలని కలలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుండా గణపతి లక్ష్మీ నరసింహ స్వామి ని అప్పటినుండి ముక్కుకుంటూ తన పత్తి చేనులో దీపారాధన చేస్తున్నారు. తాజాగా ఈ శుక్రవారం తన కుటుంబంతో మొక్కుకుందామని వచ్చి అర్చకులతో పూజలు చేపిస్తుండగా భూమిపై నీళ్లు చల్లడంతో ఒక్కసారిగా నీళ్ల ప్రవాహం పొంగి మహిమను చూపింది. దీంతో చలించి పోయిన గుండా గణపతి కుటుంబ సభ్యులు స్వామి వారికి అనుగ్రహం ఉందని భావించారు. అప్పటికప్పుడే అదే ప్రాంతంలో ఒక చిన్న చలువ పందిరి వేసి శనివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని అర్చకులు సతీష్ శర్మ సమక్షంలో పూజలు చేసి నెలకొల్పుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులతో పాటు తాండూరు మండలానికి చెందిన శ్రీ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, అభినవ సంతోష్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. విషయం తెలిసిన వెంటనే లక్ష్మీనరసింహస్వామికి పూజ సామాగ్రి తో పాటు, స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని అభినవ సంతోష్ కుమార్ దంపతులు తమ వంతుగా అందించారు. భక్తులకు అన్నదానాన్ని చేపట్టారు.





