నేటి సాక్షి మహబూబాబాద్ మార్చి 8 మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో గ్రామ దేవత సవర్ లచ్చమ్మ తల్లి ఉత్సవాలు వచ్చే ఏప్రిల్ 11, 12 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మందుల యాకన్న, ఉపసర్పంచ్ చుక్క వేణు మీడియాతో మాట్లాడుతూ గ్రామ సంప్రదాయాల ప్రకారం పెద్దల సమక్షంలో ఉత్సవాల తేదీలను నిర్ణయించినట్లు వెల్లడించారు.గ్రామ సంప్రదాయాన్ని అనుసరించి 13 మంది పెద్దమనుషుల సమక్షంలో సమావేశం నిర్వహించి ఏప్రిల్ 11, 12 తేదీలలో ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ వేడుకలు గ్రామ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఏప్రిల్ 11వ తేదీ శనివారం రోజు దేవాలయంలో ప్రత్యేక అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తదుపరి రోజు ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండు రోజుల పాటు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తల్లి ఆశీస్సులు పొందాలని గ్రామ పెద్దలు కోరారు.గ్రామ దేవత అయిన సవర్ లచ్చమ్మ తల్లి పండుగ జయపురం గ్రామంలో ఎంతో విశిష్టంగా జరుపుకుంటారని, ఈ ఉత్సవాలకు పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లు గ్రామ పెద్దలు, యువకులు కలిసి చేపడుతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో కుల పెద్దమనిషి మందుల వెంకన్న, సారి కోళ్ల మేతరి చుక్క మురళి, మందుల వెంకన్న, మందుల యాకుబ్, మందుల పరశురాములు, చుక్క అశోక్, చుక్క మధుసూదన్, నకిరేకంటి సుధాకర్, చుక్క నరేష్, చుక్క బిక్షం, మందుల ఎల్లయ్య, మందుల రామ్మూర్తి, దారం వెంకట మల్లు, దుడ్డేలా ఉప్పలయ్య, మందుల సమర తదితరులు పాల్గొన్నారు.





