*. . నేటి సాక్షి 08 మార్చి పాములపాడు:- ఈరోజు పాములపాడు మండలంలోని, నేషనల్ హైవే ఎన్ హెచ్ 340 సి రుద్రవరం గ్రామ టోల్ ప్లాజా వద్ద పాములపాడు, రుద్రవరం, తదితర గ్రామాలకు చెందిన రైతులు నందికొట్కూరు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ని కలిసి తమ సమస్యలను వివరించారు.కె.సి.కెనాల్ కాల్వకు మల్లాల ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు శాంతి నిలయం వరకు వస్తున్నప్పటికీ, అలగనూరు కాలువకు అధికారులు నీళ్లు విడుదల చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాములపాడు మండల పరిసర ప్రాంతాల్లో సుమారు 1500 ఎకరాల మొక్కజొన్న, మినుములు, కందుల పంటలు తీవ్రంగా నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే దశలో ఉండటంతో నీళ్లు అత్యవసరమని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యను అర్థం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వెంటనే ఈఈ అధికారికి మరియు ఇతర సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, కనీసం ఒక నెల రోజుల పాటు అలగనూరు కాలువకు నీళ్లు విడుదల చేయాలని కోరారు.దీనిపై అధికారులు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజవర్గ టిడిపి యువ నాయకుడు & ప్రభుత్వ టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ కురువ.రమేష్, నీటి సంఘం వైస్ చైర్మన్ కురువ వెంకటేశ్వర్లు, టేకూరి.సాయికృష్ణ, రుద్రవరం మాజీ సర్పంచ్ జాల.రామసుబ్బయ్య, హఫీజ్ ఎస్ఎండి.బషీర్ అహ్మద్, జాల కుష్టమోహన్, పి డి ఎస్ యు ఇమ్రాన్ భాష, గొల్ల రమేష్, ఓ.ఏసన్న రామకృష్ణ, ఖాసిం వలీ, సుధాకర్, హనుమంతు, లక్ష్మన్న, షేక్షావలి, శ్రీరాములు, హాతుడు, ఏసన్న, తదితర రైతులు పాల్గొన్నారు.





