Wednesday, March 11, 2026

మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 8ప్రముఖ స్వచ్చంద సేవాసంస్థ సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు, అంబేద్కర్ వారసురాలు,ఆక్ట్ మీడియా తెలుగు చైర్మన్ ఉత్తరాది గీతహరిప్రసాద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు,పలు మహిళా రక్షణ కార్యక్రమాలు గుర్తించిన అంతర్జాతీయ సంస్థ వే ఫౌండేషన్ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తిరుపతి, యూత్ హాస్టల్ లో జరిగిన దక్షిణ భారత దేశ సదస్సులో మహిళా శిరోమణి అవార్డుతో సత్కరించడం జరిగినది.ఈ అవార్డు ను ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య, డిప్యూటీ సి ఈఓ వెంకట నారాయణ, డాక్టర్ శ్రీరాములు, చేతులు మీదుగా ఇవ్వడం జరిగినది. ఉత్తరాది గీతహరిప్రసాద్ కు ఈ అవార్డు రావడం పట్ల సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News