Wednesday, March 11, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం* *సందర్భంగా మహిళా* *పోలీసులకు ఘన* *సన్మానం చేసిన వన్టౌన్ సిఐ

నేటి సాక్షి మార్చి 8 (మంచిర్యాల్ )శ్రీధర్ దమ్మ బెల్లంపల్లి వన్ టౌన్ మహిళా *సిబ్బందితో వేడుకలు* – *మహిళల సేవలు* *అభినందనీయం: సీఐ కె శ్రీనివాసరావు.* అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, మహిళల్లో సంకల్పశక్తి ఎక్కువగా ఉంటుందని, వారు ఏ రంగంలోనైనా గొప్ప విజయాలు సాధించగలరని అన్నారు. దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో హక్కులు ఉన్నాయని తెలిపారు.మహిళా అధికారులు తమ పూర్తి శక్తి, సామర్థ్యాలతో విధులు నిర్వహిస్తూ తమ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. పురుషుల కంటే మహిళల్లో నిబద్ధత ఎక్కువగా ఉంటుందని, పలు విభాగాల్లో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా సేవలందిస్తున్నారని తెలిపారు.పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్, రైటర్, పెట్రోలింగ్, బ్లూ కోట్స్, సైబర్ వారియర్స్, పాఠశాలలు మరియు కళాశాలల్లో షీ టీమ్స్ ద్వారా సైబర్ క్రైమ్‌లపై అవగాహన కార్యక్రమాలు, ముఖ్యమైన బందోబస్త్ బాధ్యతలను మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థంగా నిర్వహిస్తున్నారని అన్నారు. గృహహింస, వైవాహిక వివాదాల వంటి కేసుల్లో బాధిత మహిళలకు కౌన్సెలింగ్ అందిస్తూ మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్న సీఐ గారు, మహిళా అధికారులు ధైర్యంగా ఉండి తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. మహిళా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాస రావు గారు , ఏస్ఐ మహేంద్ర పాలన్, హెచ్ సి ముత్తన్న మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News