Wednesday, April 29, 2026

పట్టణ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవం వేడుకలు-మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తోంది-మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే బిఎల్ఆర్

నేటిసాక్షి, మిర్యాలగూడ : మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంచుతూ, అనేక సంక్షేమ పథకాలను మహిళలకు అందజేస్తున్నదని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం పట్టణంలోని మినీ రవీంద్ర భారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులను, మున్సిపాలిటీలో సేవలు అందిస్తున్న మహిళా మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మరియు మహిళా కౌన్సిలరర్స్ ని పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, ఒకప్పుడు మహిళ అంటే కేవలం ఇంటికే పరిమితం అనుకునేవారని, కానీ ఈరోజు ఆకాశంలో సగం కాదు, అన్ని రంగాల్లోనూ తనే అగ్రభాగం అని నిరూపిస్తోందని అన్నారు. ఒక ఇంటిని చక్కదిద్దే ఇల్లాలుగా, దేశాన్ని నడిపే నాయకురాలిగా స్త్రీ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయాల్లో కూడా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం అన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్వయం సహాయక సంఘాలు మరియు వివిధ పథకాల ద్వారా చేయూతనిస్తున్నాం అని, మహిళా సాధికారత అంటే కేవలం చదువు, ఉద్యోగం మాత్రమే కాదని, తమ నిర్ణయాలను తామే తీసుకోగలగడం మరియు సమాజంలో గౌరవంగా బతకడం అని, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి మన ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేస్తోందని, ప్రతి సోదరి భయం లేకుండా తిరిగే వాతావరణాన్ని కల్పించడమే మా ప్రాధాన్యత అన్నారు. ఈ వేదిక ద్వారా నేను కోరుకునేది ఒక్కటే అని,చదువుకున్న ప్రతి అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడాలని అన్నారు. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించి, వారికి ధైర్యాన్ని నూరిపోయాలి. మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అంటే ఎక్కడ మహిళలు పూజింపబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారని అర్థం. అని, మన సంస్కృతిలో మహిళకు అంతటి ఉన్నత స్థానం ఉందని,ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి మహిళా తన కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్,డీఎస్పీ రాజశేఖర్ రాజు, అర్భన్ సిడిపిఓ మమత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్స్, మహిళా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News