Monday, March 9, 2026

*మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యత పెంపొందించుకోవాలి**జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* మంచిర్యాల జిల్లా,, మార్చి 9,

నేటి సాక్షి నేటి పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యత పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని ఐ టి ఐ ప్రాంగణంలోని ఎ టి సి కేంద్రంలో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, ఐ టి ఐ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లతో కలిసి ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా పూర్తి విద్యలో శిక్షణ అందించి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా జిల్లాలోని మంచిర్యాల, నస్పూర్, మందమర్రి, జన్నారం ప్రాంతాలలో ఎ టి సి కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వృత్తి విద్యలో నైపుణ్యత గల వారికి రాష్ట్రంలో,  దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహించి అర్హత గల వారికి ఉద్యోగాలు అందించడం జరుగుతుందని, వృత్తి విద్య కోర్సులు నేర్చుకునే వారు సర్టిఫికెట్ కోసం కాకుండా నైపుణ్యత కోసం 100 శాతం హాజరు అవ్వాలని తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం ఉత్పత్తి ఉత్పాదకత సరిపడా అందించేందుకు జాబ్ మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సులను అందించడం జరుగుతుందని, నిరుద్యోగ యువత ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. *మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ*నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన ఎ టి సి కేంద్రాలలో టాటా సంస్థ వారు ఆర్థిక సహాయాన్ని అందించి విద్యార్థులకు అవసరమైన యంత్రాలు, పరికరాలను సమకూర్చడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు విద్యతో పాటు వృత్తి నైపుణ్యత కలిగి ఉండాలని, షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా తక్కువ సమయంలో నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వృత్తి విద్య శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలతో పాటు ఆసక్తి, అర్హత ఉన్నవారికి బ్యాంకు రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు  తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 600 మంది అభ్యర్థులు వృత్తి విద్య నేర్చుకుంటున్నారని, వీరిలో 80 మంది విద్యార్థినుల కొరకు మూత్రశాలలు, ఇతర సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నూతన భవనం నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా కలెక్టర్ చొరవతో హాజీపూర్ మండలం రాపల్లి ప్రాంతంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అభ్యర్థుల కొరకు కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, ఇందులో 100 మంది అభ్యర్థులకు వసతి కల్పించి 3 నెలల కోర్సు అందించడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల ప్రాంతంలో ఐ.టి. పార్క్ మంజూరు అయిందని, పనులు వేగవంతం చేసి స్థానిక నిరుద్యోగ యువతకే కాకుండా బయటి ప్రాంతాల నుండి వచ్చే వారికి సైతం ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వరకు అభివృద్ధి చెందామని, ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, మార్పులకు అనుగుణంగా మనల్ని మనం నవీకరించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ స్వయంకృషితో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News