నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 9 చౌడేపల్లి పరిధిలో గోసుల కురపల్లిలో సేవలు అందిస్తున్న 104 వాహనాన్ని జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తనిఖీ చేశారు, వాహనం యొక్క కండిషన్ను అదేవిధంగా పారిసిద్దని పరిశీలించారు, వీటితోపాటు రోగులకు ఇస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు, మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రోగులకు ఆయన వివరించారు. అనంతరం 104 వాహనంలోని పలు రికార్డులను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మోనా వాహన డ్రైవర్ దేవరాజ్ డిఇఓ అపర్ణ ఎంహెచ్పి మమత ఆశ కార్యకర్త రాదా అనిత రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.





