Monday, March 9, 2026

మండలానికి తక్షణమే పర్మినెంట్ సర్వేయర్ ను నియమించాలి-బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం

నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సర్వేయర్ ను నియమించాలనిబీసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు సోమవారం గ్రీవిన్స్ డే లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగాబీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ మాట్లాడుతూ దామరచర్ల మండలంలో పట్టాల కోసం భూభారతిలో దరఖాస్తు చేసుకున్న రైతులు వారి పేరున పట్టా కాకుండా, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై గారికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతిలో దరఖాస్తు చేసుకున్న రైతులు తాసిల్దార్ కార్యాలయం చుట్టూ సుమారు 6 నెలల నుండి తిరుగుతున్న, సర్వేయర్లు లేరు అని తహశీల్దార్ చెప్పడంపై కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. రైతుల సమస్య కంటే రైల్వే ప్రాజెక్టులు ముఖ్యమా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. జిల్లాలోని అనేక మండలాల్లో సర్వే అయిపోయి పట్టాదారు పాసు పుస్తకాలు వస్తున్నప్పటికీ దామరచర్ల మండలంలో మాత్రం రైతులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్ల చెప్పులరిగేలా తిరుగుతున్న కనీసం సర్వే చేయకపోవడం పట్ల రైతులు వారి గోడును వెళ్ళబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే భూభారతిలో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు భూమిని సర్వే చేసి, వారికి వెంటనే పట్టా పాస్ పుస్తకాలు అందించాలని కలెక్టర్ ని కోరినట్లు తెలిపారు. వినతిపత్రం అందజేసిన కారిలో యాదగిరి, లక్ష్మీనారాయణ, సైదులు, శ్రీను, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News