నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ లో ఉన్న కళాభారతి ఆడిటోరియంలో సోమవారం నుండి “నందినీ నాటకోత్సవాలు” ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు వారం రోజులపాటు పౌరాణిక, పద్య నాటికల పోటీలు, సాంఘిక నాటికల పోటీలు నిర్వహించబడుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శైలజ, జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు పాల్గొని మొదటగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల తేదీ (గురువారం) 12న జాతీయ స్థాయి “పాటల పోటీలు” నిర్వహించబడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు, అధ్యక్షులు రామావతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, ఆంజనేయ శర్మ, రోశయ్య చౌదరి, శ్రీనివాస్ నాయుడు, పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.





