Monday, March 9, 2026

బెల్లంపల్లి నియోజక వర్గంలో కన్నాల గ్రామంలో శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి క్షేత్రంలో భక్తిప్రపత్తులతో బెల్లంపల్లి మున్సిపల్ పట్టణం లో 3వ వార్డు నుంచి ఎన్నికైనా నూతన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహా ‘అన్నప్రసాదం’ వితరణ.

నేటి సాక్షి (మంచిర్యాల్) మార్చి 09 శ్రీధర్ దమ్మమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో మూడు కొండల మద్యలొ స్వయంబు వెలిసిన ముక్కంటి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నేడు భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.* *సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 3వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి శ్రీ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యుల ఆద్వర్యం లో ఈ మహ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.**సేవా దృక్పథం: 3వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి బెడ్డల సౌజన్య – విజయ్ కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ మహ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది.**భక్తుల రాక: స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.**ఆధ్యాత్మిక వాతావరణం:* *అన్నదాత సుఖీభవ’ అంటూ భక్తులు హృదయపూర్వక ఆశీస్సులు అందజేశారు. ముక్కంటి శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దైవ దర్శనంతో పాటు అన్న ప్రసాదం స్వీకరించారు.**”సమాజ సేవలో భాగంగా, భక్తుల సౌకర్యార్థం ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించాలి అని భక్తులు కోరడం అభినందనీయం.మన అందరికి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్ల వేళలా ప్రజలపై ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం.అని 3వ కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ తెలిపారు.**భక్తుల స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం (కన్నాల) సోమవారం పర్వదినం సందర్భంగా భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మూడు కొండల మధ్య నిరంతరం ఉద్భవించే ‘బుగ్గ’ నీటి ధారతో, ముక్కంటి పరమశివుడు కొలువై ఉన్న ఈ పుణ్యస్థలంలో 3వవార్డు కౌన్సిలర్ శ్రీమతి బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం భక్తుల ప్రశంసలందుకుంది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News