నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి మార్చ్ 09 కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా (రిజిస్ట్రేషన్ నెం. 259) ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ తహసీల్దార్ మధుకర్ కు వినతి పత్రం సమర్పించారు.ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు వెంకన్న అధ్యక్షులు అహ్మద్ పాషా మాట్లాడుతూ దాదాపు గత ఆరు నెలలుగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ప్రెస్ క్లబ్ కోసం స్థలాన్ని కేటాయించని లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం.ఎదుట నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు.జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. మా న్యాయమైన డిమాండ్‌ను వెంటనే పరిష్కరించాలి. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోరినారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అహ్మద్ పాషా ప్రధాన కార్యదర్శి ఈర్ల సతీష్ కుమార్ ఉపాధ్యక్షుడు నిరంజన్ సభ్యులు హర్షద్ అలీ రాజనర్సయ్య కార్యవర్గ సభ్యులు తదితరులు. పాల్గొన్నారు





