Tuesday, March 10, 2026

మున్సిపాలిటీ పౌర సమాచార అధికారిని సస్పెండ్ చేయాలి….సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్…. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ…..

నేటి సాక్షి, నారాయణపేట మార్చు 10, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ )నారాయణపేట జిల్లా జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యములో జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారి కార్యాలయ పి ఐ ఓ గారికి తారీకు 07-11-2025 నాడు సమాచారం కోసం దరఖాస్తు చేస్తే, పి ఐ ఓ సెక్షన్ 6(3) ప్రకారంగా జిల్లాలోని అన్ని శాఖలకు బదిలి చేసే క్రమంలో నారాయణపేట మున్సిపాలిటీ కార్యాలయనికి బదిలీ చేస్తే, అక్కడున్న పి ఐ ఓ నిర్లక్ష్యంగా సమాచారం కోసం దరఖాస్తు చేసిన 7 అంశాలకు నిల్ అని సమాధానం ఇస్తూ, ఇందులో సెక్షన్ 4(1)(బి) అడిగిన అట్టి అంశానికి కూడా నిల్ అని సమాధానం లెటర్ పూర్వకంగా పంపించారు. ఇంత నిర్లక్ష్యంగా సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరిచే విధంగా, డ్యూటీ పరంగా ఇంత నిర్లక్ష్యం చేసిన అట్టి అధికారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి గారికి కంప్లయింట్ ఇవ్వడం జరిగింది. ఇందులో రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య,జిల్లా ఇంచార్జీ కుర్మయ్య,జిల్లా కార్యదర్శి గజలప్ప, నారాయణపేట అసెంబ్లీ ఇంచార్జీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News