Tuesday, March 10, 2026

**చిలుకూరు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా*

నేటి సాక్షి ..చిలుకూరు 👉బడ్జెట్ లో బీసీలకు 50వేల కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ . 👉బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లుట్ల కనకయ్య. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల రెవెన్యూకార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లుట్ల కనకయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బిసి సబ్ ప్లాన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని బీసీల సంక్షేమానికి,అభివృద్ధికి బడ్జెట్లో 50వేల కోట్ల రూపాయలు కేటాయించి వాటిని నిష్పక్షపాతంగా ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు. వినతి పత్రాన్ని మండల రెవెన్యూ కార్యాలయంలోసీనియర్ అసిస్టెంట్ పుష్పలతకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలోసిపిఐ చిలుకూరు గ్రామ శాఖల కార్యదర్శులు షేక్ సాహెబ్ అలీ చిలువేరు ఆంజనేయులు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు, బాలబోయిన మహేష్, మాదారపు కొండలు, కొండ రాములు, దొడ్డ నాగేశ్వర్ రావు, మాదారపు లక్ష్మయ్య, షేక్ జానీ, కందుకూరి పెద్ద వెంకటేశ్వర్లు, షేక్ కాజా, కొడారు రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News