Tuesday, March 10, 2026

పశువుల ఆరోగ్య రక్షణకు ఉచిత గాలికుంట వ్యాధి నివారణ కార్యక్రమం…డాక్టర్ బి. మమత ఆధ్వర్యంలో టీకాల కార్యక్రమం..రైతుల ఆర్థిక బలానికి పశువుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం.. మొగిలిచర్ల సత్యనారాయణ (సర్పంచ్)

నేటి సాక్షి, మునగాల ( పాముల రాఘవేందర్) మునగాల మండలం రేపాల గ్రామంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం పశువైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా గాలికుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పశువులకు వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా టీకాలు వేయడంతో పాటు పశుపాలకులకు పశువుల సంరక్షణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాన్ని పశువైద్య అధికారి డాక్టర్ బి. మమత తమ సిబ్బందితో కలిసి నిర్వహించారు. రైతులు తమ పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత సేవలను తప్పకుండా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే రేపాల గ్రామంలో ( మార్చి 10 నుండి16వ తేదీల వరకు ) సీతనాగారం( 17నుండి 20వ తేదీల వరకు ) జగన్నాధపురం ( 23 నుండి 28వ తేదీ వరకు ) నరసింహుల గూడెం ( 30 నుంచి ఏప్రిల్ 04వ తేదీ వరకు) విజయ రాఘవాపురం( ఏప్రిల్ 06 నుండి09వ తారీకు వరకు) శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రేపాల గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ పాల్గొని ఆయన మాట్లాడుతూ. రైతుల అభివృద్ధిలో పశుసంవర్ధక రంగం కీలక పాత్ర పోషిస్తుందని, పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో కొనసాగడం ఆనందకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, ఎల్ ఎస్ ఏ ప్రమీల,గోపాలమిత్ర శీను గ్రామ ప్రజలు పశుపాలకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News