*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న కస్తూరిబా బాలికల హాస్టల్ లో మంగళవారం వరలక్ష్మి కిరాణం గొల్లపల్లి స్థానిక వ్యాపారవేత్త. కాల్వ శ్రీనివాస్ యాదవ్. పరీక్ష పాడ్స్, పెన్నులు పంపిణీ చేసినరు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పదవ తరగతి మీ జీవితానికి ఒక తొలి మెట్టుగా జీవితాన్ని తీర్చిదిద్దుతుంది కాబట్టి పదవ తరగతిలో మంచి మార్కులు సాధించలని అన్నారు. ఎస్.ఓ. పద్మా మాట్లాడుతూ మా విద్యార్థులకు ప్రోత్సాహానికి పెన్నులు పరీక్ష ప్యాడ్స్ ఇచ్చినందుకు వారి విద్యా జీవితంలో విజయాలు సాధించడం కొరకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని అన్నారు.ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యులు ఆవుల రాజశేఖర్, 8వ వార్డు సభ్యులు ఆవుల చంద్రశేఖర్,సామాజిక సేవ కార్యకర్తలు సాతల లక్ష్మణ్, గంగాధర మధుసూదన్, రంగు సాగర్,కట్ట రవి, సందేవేణి సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు…





