Tuesday, March 10, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపాల పశువైద్య అధికారి డాక్టర్ బి. మమతకు ఘన సత్కారం..సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ బి. మమత మహిళా దినోత్సవం సందర్భంగా విశిష్ట మహిళా ఉద్యోగిగా గుర్తింపు పశుసంవర్ధక రంగంలో సేవలకు గాను అవార్డు..రేపాల గ్రామ పశువైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అధికారి గ్రామీణ ప్రాంతంలో పశువైద్య సేవలకు ప్రశంసలుమహిళలు ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుకుంటూ సమాజ అభివృద్ధికి మార్గదర్శకులవుతున్నారు.–జిల్లా ఎస్పీ నరసింహ

నేటి సాక్షి, మునగాల ( పాముల రాఘవేందర్)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ అభివృద్ధిలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామ పశువైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న పశువైద్య అధికారి డాక్టర్ బి. మమత ప్రత్యేక అవార్డుకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా డాక్టర్ బి. మమత అవార్డు స్వీకరించారు. పశువుల ఆరోగ్య సంరక్షణలో కృషి చేస్తూ రైతులకు, పశుపాలకులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు.గ్రామీణ ప్రాంతంలో పశుసంవర్ధక రంగ అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తున్న డాక్టర్ బి. మమత సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. మహిళలు ప్రతి రంగంలో ముందుండి సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నారని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News