నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులుపాఠశాలల్లో చేపట్టే వినూత్న కార్యక్రమాల్లో భాగంగా…రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా *యు.పి.ఎస్ పెద్ద మసాన్ పల్లి విద్యార్థులు ప్రతి మంగళవారం రహదారి కూడలిలో వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలను తెలియజేస్తున్నారు.గత పది వారాలుగా ప్రతి మంగళవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు గారు తెలియజేశారు.* విద్యార్థులతో బ్యానర్ మరియు రోడ్డు భద్రతా నియమాలతో కూడిన పేకార్డులను ప్రదర్శింపజేస్తున్నామన్నారు. నియమాలు పాటించని వాహనదారులను ఆపి వారికి నియమాలను తెలియజేయడం జరిగింది అన్నారు. అదేవిధంగా నియమాలు పాటించే వారికి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమ ప్రేరణతోనే గ్రామ సర్పంచ్ శ్రీ పన్యాల ప్రవీణ్ రెడ్డి గారు గ్రామంలోని ద్విచక్ర వాహనదారులందరికీ ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.గత జనవరిలో గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్వయంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు పాల్గొనడం జరిగింది. విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్వయంగా ప్రశంసించడం జరిగింది. విద్యార్థుల ద్వారా అవగాహన కార్యక్రమాల్ని చేపట్టడం పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా విద్యార్థులచే అవగాహన కార్యక్రమం చేపట్టడం మంచి ఫలితాలను ఇస్తోందని పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు.ఈ విద్యా సంవత్సరంలో 10 వారాలుగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వాహనదారుల నుండి మంచి స్పందన వచ్చింది.





