Wednesday, March 11, 2026

మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య సుడిగాలి పర్యటన

నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా కేంద్రం లో నీ బిజెర్ చౌరస్తా నుండి రామయ్య గూడ వరకు ఇటీవల శుభ్రం చేసిన ఓపెన్ డ్రైన్ ను పరిశీలించిన చైర్మన్ అనన్య 23 వార్డు లోని ఆలంపల్లి ఈద్గా వద్ద రంజాన్ పండుగ రోజు జరిగే ప్రత్యేక ప్రార్థనల కోసం చేసే ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్ధనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఆలంపల్లి బోనమ్మగుంత దేవాలయ పరిసరాలను పరిశీలించి, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అవసరమైన మౌళిక వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.తదుపరి రామ్ మందిర్ ఎదురుగా అనంతగిరి రోడ్డు లోని లైబ్రరీ పక్కన ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశీలించి, శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.అనంతరం 29 వ వార్డులోని మిషన్ కాంపౌండ్ లో ఉన్న ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో ఉన్న కిచెన్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్ధినిలతో పాటుగా భోజన చేసి, మెను ప్రకారం ఆహార పదార్థాలు పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మెను ఫాలో కావాలని, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.మున్సిపల్ కమిషనర్ విక్రంసింహా రెడ్డి, వార్డు కౌన్సిలర్ , స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News