Wednesday, March 11, 2026

చెస్ గేమ్ వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది**జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్*——————————————

*నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………చెస్ గేమ్ తో జ్ఞాపకశక్తి,విశ్లేషణ సమస్య పరిష్కారం,నైపుణ్యాల ను పెంచుతుందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.ఈరోజు స్థానిక ఓల్డ్ హై స్కూల్ జగిత్యాలలో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అధ్యక్షులు గండ్ర వెంకటరమణారావు సహకారంతో జగిత్యాల అర్బన్ మండల పరిధిలోని ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ 48 పాఠశాలలకు 200 చెస్ బోర్డు లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు. వారు మాట్లాడుతూ చెస్ గేమ్ తో ఓర్పు సహనం క్రమశిక్షణ అలవాటు పడుతుందని వారన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందుతుందని అన్నారు.*మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ* ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించినందుకు గ్రేటర్ అట్లాంటా సొసైటీ ఆఫ్ తెలంగాణ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రకళ,చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్,వార్డ్ కౌన్సిలర్ అరవ లక్ష్మి,పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు బోయిని పెల్లి ఆనంద్ రావు,యాల్ల అమర్నాథ్ రెడ్డి, కమిటీ సభ్యులు సురేష్,సెక్టోరల్ ఆఫీసర్ మహేశ్,మాజీ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News