నేటిసాక్షి, నల్లగొండ : సైన్స్ మరియు ఆధ్యాత్మికత ద్వారా మంచి వ్యక్తిత్వాన్ని పొందవచ్చనిఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి అగర్వాల్, కాన్పూర్) ప్రొపెసర్ వరుణ్ అగర్వాల్ అన్నారు. పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల స్వయం (ప్రతిపత్తి)లో బుధవారం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన, అకడమిక్ బ్రాంచ్ వేదాంత ఇనిస్ట్యూట్, యన్ యస్ యస్ యూనిట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొపెసర్వరుణ్ అగర్వాల్( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి అగర్వాల్, కాన్పూర్) పాల్గొని, మాట్లాడారు. సైన్స్ మరియు ఆధ్యాత్మికత ద్వారా బలమైన మరియు సమతుల్య వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలో చెప్పారు. మరొక్క ముఖ్యవక్త కె. వాసుదేవ రావు (అలుమ్నుస్ ఐఐటి కాన్పూర్ మరియు ప్రెసిడెంట్ భక్తివేదంత ఇనిస్ట్యూట్, కోల్ కత్తా), మాట్లాడుతూ, భావోద్వేగంలో కోపాన్ని, సంతోషాన్ని సమానంగా సమన్వయం చేసుకోవాలని, అతి సున్నితమైన విషయాలలో భావోద్వాగానికి లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అకడమిక్ కో-ఆర్డినేటర్ నాగరాజు, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా మును స్వామి, యన్ యస్ యస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యన్ కోటయ్య, వెంకటరెడ్డి, శివరాణి, మల్లేశం, అనిల్ కుమార్, సావిత్రి బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





