నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతి నిధి మార్చ్ 11 కాగజ్ నగర్ పట్టణంలో పలుహోటళ్లలో తనిఖీలు.పరిశుభ్రత పాటించని హోటళ్లకు జరిమానాలు విధించడం జరిగింది ప్రజా పాలన. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా హోటళ్లలో పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం మరియు వ్యర్థాల నిర్వహణను అధికారులు పరిశీలించారు. పరిశుభ్రత పాటించని కొన్ని హోటళ్లకు జరిమానాలు విధించారు.హోటల్ యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటిస్తూ వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులు సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ డి. ప్రణీల్ కుమార్ , శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం. శంకర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.





