Wednesday, March 11, 2026

*పాములపాడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ లో చేరుటకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి:-ఎం.రాజ్యలక్ష్మి (ప్రిన్సిపాల్)*.

నేటి సాక్షి 11మార్చి పాములపాడు:- పాములపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026 నుండి 27 విద్య సంవత్సరానికి గాను 6 వ ఆరవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసి గ్రూపులో చేరుటకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపాల్ యం.రాజ్యలక్ష్మి తెలియజేశారు. ఈనెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో https: // apkgbv.apcfss.in లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైన్ జిరాక్స్ పేపర్ లు పాములపాడులోని, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఆరవ తరగతిలో 40- సీట్లు మరియు ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపిసి)లో 40- సీట్లు ఉన్నాయని తెలిపారు. మధ్యలో బడి మానేసిన పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు మరియు తల్లి గాని తండ్రి గాని లేని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత కల్పించబడునని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పాములపాడు కేజీబీవీ కళాశాల ప్రిన్సిపాల్ యం.రాజ్యలక్ష్మి తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News