నేటి సాక్షి మార్చి 12 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మమంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ సిసిసి ఎక్స్ రోడ్ వద్ద గల సహారా ఇండియా కార్యాలయం ముందు సహారా బాధితులు మేము కట్టిన డిపాజిట్లను వెంటనే చెల్లించాలని వినతిపత్రం ఇచ్చి నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సహారా ఇండియా సంస్థపై గతంలో ఉన్న నమ్మకంతో మేము కష్టపడి పైసా పైసా పోగేసి కూడా పెట్టుకొని సంపాదించుకున్న వేలాది రూపాయలను సహారా సంస్థ ఏజెంట్ల మాయమాటలు నమ్మి సింగరేణి విశ్రాంత ఉద్యోగులు వయోవృద్ధులు ఒంటరి మహిళలు కూలినాలు చేసుకొనే పేద మధ్య తరగతి ప్రజలు చిరు వ్యాపారులు తదితరులు సహారా సహారా ఇండియా సంస్థలో కోట్లాది రూపాయలను ఫిక్స్ డిపాజిట్ చేసినారని విషయాన్ని ఈ వినతిపత్రంలో మేనేజర్ గారికి తెలియజేయడం జరిగినది .కానీ సహారా ఇండియా సంస్థలు పిక్స్ డిపాజిట్ చేసిన లక్షలాదిమంది ఖాతాదారుల పాలసీలు మెచ్యూరిటీలు పూర్తి అయి ఏండ్లు , సంవత్సరాలు గడుస్తున్న లక్షలాదిమంది సహారా ఖాతాదారులైన సీనియర్ సిటిజన్స్ వృద్ధ మహిళలను వయోవృద్ధులను సహారా ఇండియా ఆఫీసుల చుట్టూ మా చెప్పులు అరిగేలా తిపించుకుంటూ ఒక నెల తర్వాత రండి మూడు నెలల తర్వాత రండి ఆరు నెలల తర్వాత రండి అంటూ ఆన్లైన్లో నమోదు చేయాలని సహారా ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ పట్టాలో తప్పులు ఉన్నాయని లాయర్ ద్వారా నోటరీ తేవాలని కలబొల్లి మాటలు చెప్తూ సంవత్సరాల తరబడి సహారా ఆఫీసుల చుట్టూ మమ్ములను తిపించుకుంటున్నారని ఈ సందర్భంగా బాధితులు వాపోయినారు. సహారా ఇండియా లో పాలసీలు మెచ్యూరిటీ పూర్తిఅయిన వారి డబ్బులు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసినారు. అదేవిధంగా సహారా ఇండియాలో లక్షలాదిమంది డిపాజిట్ చేసిన ఖాతాదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మానసిక మానసిక శోభ అనుభవిస్తున్నారని మేనేజర్ గారికి తెలియజేసినారు. కావున 10-15 రోజులలో సహారా ఇండియా సంస్థలో మేము డిపాజిట్ చేసిన ఖాతాదారులకు వారి వారి డబ్బులు వెంటనే చెల్లించాలని లేనియెడల సహారా కార్యాలయం ముందు బెల్లంపల్లి మందమర్రి మంచిర్యాల నస్పూర్ సహారా కార్యాలయం ముందు సహారా ఖాతాదారులతో కలిసి శాంతియుతంగా పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు గాని లేకుంటే అమర నిరాహార దీక్షలు గాని చేపడతామని ఈ సందర్భంగా మేనేర్ గారికి తెలియజేయడం జరిగినది. అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గారి మరి అదే విధంగా ఎంపీ గారు కానీ లేకుంటే స్థానిక ప్రభుత్వంలోని మంత్రులు గాని , స్థానిక మన జిల్లా కలెక్టర్ గారు కానీ సహారా బాధితుల మొరను వెంటనే ఆలకించి సంబంధిత సహారా సంస్థ యాజమాన్యం తో మాట్లాడి ఆర్థిక ఇబ్బందులతో సతమత అవుతున్న సహారా బాధితులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు బీసీ సంఘాల నాయకులు గజెల్లి వెంకటయ్య , సహారా బాధితులు జి వెంకట్ రెడ్డి , పెద్దపల్లి మల్లయ్య , మోతే కాంతయ్య, డి రాజమౌళి , అంకం సతీష్ , రెడవని శంకర్, కే మల్లయ్య, పిరిపిరెడ్డి అరుణ , నక్షత్ర , మహేష్, సహారా మహిళా బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.




