Thursday, March 12, 2026

విద్యార్థుల విజయమే పాఠశాల గౌరవం: —-మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాసరెడ్డి.పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ..

నేటి సాక్షి గజ్వేల్ :—కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థులకు గురువారం పరీక్ష ప్యాడ్లను, పెన్నులను కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే మన పాఠశాలను మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరారు.విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని అధిగమించి, ప్రశాంతంగా, ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ గౌతమి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేసిన చైర్మన్ శ్రీనివాస రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News