Saturday, March 14, 2026

*కోరుట్ల మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలోనే రగడ.!*—————* 35 అంశాల్లో 34కు కౌన్సిల్ సభ్యుల ఆమోదం* వార్డులలో మురికి కాలువల శుభ్రతపై చర్యలు తీసుకోవాలని సభ్యుల సూచన* ఆ ఒక్కవార్డుకే ‘నిధుల ప్రేమ’ ఎందుకని ప్రశ్న..రగడ.. అన్ని వార్డులకు సమాన నిధులకు ఆమోదం* బడ్జెట్ సమావేశం నుంచి ‘కాంగ్రెస్ సభ్యులే’ వాకౌట్ * ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పనులు చేపడతామని చైర్‌పర్సన్ వెల్లడి——*

నేటి సాక్షి – కోరుట్ల* ( రాధారపు నర్సయ్య )కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.అయితే తొలి సమావేశంలోనే రగడ మొదలైంది.*కాంగ్రెస్ కౌన్సిలర్ ల వాకౌట్.!*మున్సిపల్ బడ్జెట్ సమావేశంపై ప్రస్తుత కౌన్సిలర్ లు,మాజీ మున్సిపల్ చైర్మన్,ఛైర్ పర్సన్ లు అభ్యంతరం తెలిపి వాకౌట్ చేశారు.మున్సిపల్ చట్టం ప్రకారం ఏడు రోజుల ముందు సభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా..కేవలం రెండు రోజుల ముందే ఇవ్వడం సరికాదని అన్నం లావణ్య,గడ్డమీది పవన్ లు ఆరోపించారు.ఈ క్రమంలోనే 23 వార్డుకు మాత్రమే రూ.3.5 లక్షలు కేటాయించడంపై సభలో గందరగోళం జరిగింది.కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో 33 వార్డులుంటే..ఒక్క 23 వ వార్డుకు మాత్రమే ప్రేమ చూపడంలో ఆంతర్యమేంటని సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దీంతో ఛైర్ పర్సన్ అన్ని వార్డులకు సమానంగా రూ.3.5లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ఆమోదం తెలిపారు.*కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు*కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో మొత్తం 35 అంశాలను అజెండాగా పొందుపరిచారు. వాటిలో 34 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు.సమావేశంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో మురికి కాలువలను శుభ్రం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు కోరారు. కాలువలు శుభ్రం చేయడం ద్వారా పట్టణంలో పరిశుభ్రత మెరుగుపడుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.*ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పనులు*ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత మాట్లాడుతూ.. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రపరిచే పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వసంత, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహెద్, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఈఈ, మేనేజర్, జేఏఓతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు._______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News