*నేటి సాక్షి, నల్లబెల్లి* పేదల సొంత ఇల్లు కల నెరవేరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిచ్చా తిరుపతిరెడ్డి అన్నారు. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన పెద్దొజు రామ రమణాచారి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడుతూ… మండలంలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకొని లబ్ధిదారులు గృహప్రవేశాలు నిర్వహించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాలోత్ రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, మండల కాంగ్రెస్ పార్టీ బి సి సెల్ అధ్యక్షుడు కుసుంబ రఘుపతి,వి ఎఫ్ జి నల్లబెల్లి అధ్యక్షుడు పోలుదాసరి శ్రీనివాస్, యువ నాయకులు డేగల కృష్ణ,వార్డు మెంబర్లు కుసుంబ విశ్వతేజ, మండల సుజాత గ్రామ నాయకులు ముత్తిరెడ్డి యాదవ రెడ్డి, బండారి రాజమౌళి, గోగులోతు రాజు తదితరులు పాల్గొన్నారు.





