Sunday, March 15, 2026

అనుమతులు లేని మద్యం సెట్టింగులు….. వైన్ షాప్ యజమానులకు డబ్బులు…. పట్టించుకోని అధికారులు…..

నేటి సాక్షి నారాయణపేట మార్చు 15, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లా లోని మరికల్ మండల కేంద్రంలోని ఆత్మకూరు వెళ్లే రహదారిలో గల మద్యం ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది…. గత టిఆర్ఎస్ పాలనలో వైన్ షాప్ లకు సిట్టింగ్ అనుమతుల కోసం టెండర్ సిస్టంలో అప్పట్లో ప్రవేశపెట్టింది. అప్పట్లో ఏడాది సిట్టింగ్ పరిమిషన్ కోసం లక్షల రూపాయలు టెండర్ వేసి సిట్టింగ్ నడిపేవారు. కొందరు అధిక టెండర్ వేసి వారు దక్కించుకునేవారు. గత సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం అట్టి విధానాన్ని అమలు పరచలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి విధానాన్ని అమలుపరిచినందున ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని చర్చించుకుంటున్నారు. మరికల్ మండల కేంద్రంలోని ఆత్మకూరు వెళ్లే రహదారిలో ఉన్న మద్యం దుకాణం పక్కనే సిట్టింగ్ ను ఏర్పాటు చేసి నెలకు సెట్టింగ్ నడిపే వారి నుండి రూ,33 వేల రూపాయలు డబ్బులు జమ చేసుకుంటున్నారని మరికల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇట్టి పద్ధతిని అలంబిస్తున్న వారిపై ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు ఏమి లేవని పలువురు అనుకుంటున్నారు. అనుమతులు లేని సిట్టింగ్లకు వైన్స్ యజమానులు తమకు అనుకూలంగా ఉన్నవారికి సెట్టింగ్లు నడిపే అక్రమ వసూళ్లను చేస్తున్నారని, అక్రమవస్తులను ఆపాలని మరికల్ మండల లోని పలు గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వ అనుమతులు దుకాణాల పై సెటప్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైన్ షాప్ యజమానులు ఆధ్వర్యం లో కొనసాగుతున్న సిట్టింగ్లపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News