Tuesday, March 17, 2026

*ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి* *గృహ ప్రవేశానికి సిద్దం చేయాలి**కలెక్టర్ గరిమ అగ్రవాల్**మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఏఈ పీఆర్, హౌసింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షమిక్ష*

*నేటి సాక్షి సిరిసిల శివకుమార్* ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, గ్రామ సమాఖ్య, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, టాయిలెట్ల నిర్మాణాలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఏఈ పీఆర్, హౌసింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు త్వరితగతిన ఇళ్లు పూర్తి చేసుకునేలా సహకారం అందించాలని సూచించారు. తుది దశలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఈ నెల ఆఖరున మెగా గృహ ప్రవేశ కార్యక్రమానికి సిద్దం చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. వడ్రంగి, ప్లంబర్, మేస్త్రి ఇతర ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన బడ్జెట్ లోనే ఇండ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, ఆయా మండలాల్లో గుడిసె ల్లో ఉంటున్న వారి వివరాలు సేకరించాలని, వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. హౌసింగ్, మున్సిపల్ అధికారులు ఇండ్ల నిర్మాణాల ఫోటోలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయమై జడ్పీ డిప్యూటీ సీఈవో, హౌసింగ్. ఇతర అధికారులను కలెక్టర్ అభినంది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News