Saturday, April 18, 2026

*మరణించిన పెంచికల పల్లె అంకాలమ్మ కుటుంబానికి సంఘం కళాకారుల తరఫున 5వేలు అందజేసిన మండల అధ్యక్షుడు బి.నాగలింగయ్య*.

నేటి సాక్షి 18 ఏప్రిల్ పాములపాడు:- పాములపాడు మండలంలోని, పెంచికల పల్లె గ్రామం, యాండ్ల అంకాలమ్మ 1872/11, భజన కళాకారిణి ఆకస్మికంగా మరణించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. భజన కళాకారులకు సహాయనిధిగా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లో వారు రూ: 100/- సభ్యత్వం కట్టి చేరినందున ఆమె మరణించిన సందర్భంగా కుటుంబానికి అఖిలభారత ప్రాచీన తెలుగు జానపద వృత్తి కళాకారుల సంఘం తిరుపతి నుండి 5,000/- రూపాయలు, జిల్లా అధ్యక్షుడు నాగేష్ నాయకత్వంలో మండల అధ్యక్షుడు మరియు బృందం లీడర్ నాగలింగయ్య ద్వారా అందజేయడం జరిగింది. దీని ఉద్దేశం గ్రామాలలో భజన సంస్కృతి మరింత పెరగడానికి, భజన కళాకారులు భజన చేయడానికి ముందుకు వచ్చేదానికి, మన ఆధ్యాత్మిక ధర్మప్రచారం మరింత పెంచడానికి మావంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. మాకు మీరంతా సహకరించాలని జాతీయ అధ్యక్షులు పులిమామిడి యాదగిరి కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News